Tuesday, 23 September 2014
Monday, 22 September 2014
Thursday, 18 September 2014
Wednesday, 17 September 2014
Tuesday, 16 September 2014
Mystery shadow of the Temple
ఆలయంలో నీడ మిస్టరీ:
ఆలయంలో నీడ మిస్టరీ వీడినది.
ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది.
అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్ లెక్చరర్. నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం.
11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి.
కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది?
ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్.
ఎలా కనిపెట్టాడు?
శేషగాని మనోహర్ గౌడ్ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పిజీ కాలేజ్లో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆరేడేళ్ల క్రితం ఒకరోజు కోడి శ్రీనివాస్ అనే స్నేహితుడు ఆయన్ని ఛాయా సోమేశ్వరాలయానికి తీసుకెళ్లాడు. అక్కడి నీడ గురించి చెప్పి 'నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా. నువ్వు ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు' అని ప్రోత్సహించాడు. ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్ని వెంటాడింది. ఎలాగైనా ఆ రహస్యాన్ని చేధించాలని ఒంటరిగా వెళ్లి ఆ గుళ్లో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించాడు. కొలతలు తీసుకున్నాడు. ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది, తూర్పు, పడమర, ఉత్తరంవైపు మూడు గర్భగుళ్లు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది. మిగిలిన రెండు గుళ్లలో అంతా చీకటిగా ఉంటుంది. మధ్యలో నాలుగు స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద, మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రిక్ సిస్టమ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాలో థర్మాకోల్తోగుళ్లను, కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్.
చీకటి గదిలో టార్చిలైటుని సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. యురేకా ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. "ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు... ఒకటి.. నీడ ఏ స్తంభానిది?, రెండు.. ఏ దిశ నుంచి వచ్చే కాంతిది? అని. గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది. అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు.. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివ లింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. ఇక్కడ మళ్లీ రెండు అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా? రెండోది.. సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉద యించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్ ట్రాక్ అంటారు. అందుకే పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుళ్లో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్లో కూడా నీడపడేది.
వాహ్! ఆ కాలంలోనే భౌతికశాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన కుందూరు చోళులకు హ్యాట్సాఫ్. ఇలాంటి కట్టడం ఇప్పుడు శిథిలావస్థలో ఉండడం బాధాకరం.
ఇలాంటి అద్భుత కట్టడాలు మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖకు ఉంది.
ఇది వివిధ బ్లాగులలో... దినపత్రికలో... ఫేస్ బుక్ లో సేకరించిన సమాచారం...నేను స్వంతంగా సృష్టించినది కాదు
ఈ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని టివి-9 లో కూడా ప్రసారం చేయడం జరిగింది.. నాకు తెలిసింది ఈ రోజు మాత్రమే... నాలా ఇంకా చాలా మందికి ఈ సమాచారం తెలియక పోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ ను వేస్తున్నాను.
అత్యద్భుత కళాసంపదకు నిలయమీ ఆలయం.. నేషనల్ హైవే కు కేవలం పదిహేను కి.మీ. దూరంలో నల్గొండకు ముందుగానే దర్శనమిస్తుందీ ఆలయం... నార్కెట్ పల్లి నుండి నల్గొండకు వెళ్ళే మధ్య దారిలో ఉంటుంది.
Monday, 15 September 2014
Russian hackers have hacked 5 lacks Google Accounts
5 Lacks Google gmail acounts usernames and passwords were hacked and leaked Tuesday(09-09-2014) on a Russian Bitcoin security Relevant Products/Services forum.
According to a Tweet from Peter Kruse, a Danish cybersecurity expert, the data Relevant Products/Services likely originated from a number of data breaches, not just one. Most of the passwords were more than three years old, he added.
Even though the information appears to be outdated, security experts recommend that people regularly update their passwords in the event of such breaches. They also suggest that Gmail users take advantage of the two-factor authentication system, which offers an added layer of security.
Reference: http://www.toptechnews.com/article/index.php?story_id=03300317BG9X
Saturday, 13 September 2014
Who is the writer of Indian Pledge?
ప్రతి భారతీయుడు రోజు పోదున్నే స్కూల్ లో భారత దేశం నా మాతృభూమి భారతీయులు అందరు నా సహోదరులు రాసింది మాత్రం చేపమంటే చాల మందికి తెలియధు. తెలుసుకుందాం అనుకుంటే టెక్స్ట్ బుక్ లో కూడా అతని పేరు ఉండదు. అతను ఎవరు అంటే పైడిమర్రి వెంకటసుబ్బ రావు. తెలంగాణా రాష్ట్రం నల్గొండ జిల్లా అన్నెపర్తి లో జన్మించరు. 1962 లో జాతీయ ప్రతిజ్ఞ రాసాడు. 1988 లో మరణించారు.
Pydimarri Venkata Subba Rao composed the National Pledge in Telugu in 1962 while he was serving as the District Treasury Officer of Vishakhapatnam District. Pydimarri Venkata Subba Rao was a Telugu Author. Born on Anneparthy, Nalgonda, Telangana, India, Died in 1988, Notable works Kalabhairavudu, Author of National Pledge of India in Telugu.
Read More : http://en.wikipedia.org/wiki/Pydimarri_Venkata_Subba_Rao
Pydimarri Venkata Subba Rao composed the National Pledge in Telugu in 1962 while he was serving as the District Treasury Officer of Vishakhapatnam District. Pydimarri Venkata Subba Rao was a Telugu Author. Born on Anneparthy, Nalgonda, Telangana, India, Died in 1988, Notable works Kalabhairavudu, Author of National Pledge of India in Telugu.
Read More : http://en.wikipedia.org/wiki/Pydimarri_Venkata_Subba_Rao
Govt Information to Anyone found the Important ID Cards
భారత దేశ గవర్నమెంట్ ఉతర్వులు: ఎక్కడైనా ఎవరైనా ఐడి ప్రూఫ్స్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఎవైన ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్స్ దొరకిన యెడల వాటిని మీకు దగరలో ఉన్న పోస్ట్ బాక్స్ లో కానీ పోస్ట్ ఆఫీసు లో ఇవండీ. వాటిని సంబంధించిన వాలకు పోస్ట్ చేస్తారు. డబ్బులు కూడా వాటికీ సంబందించిన వారి దగ్గరినుండి వసులుచేసుకుంటారు.
Please Anybody can found the passports, driving licences or Any Important id cards. Please Give By Near your Post office. They Return to who owned them. They also collected money to who owned man.
Some of the Principles of Health
Some of the Principles of Health
- Always on the phone to speak left-hand side
- Cold water should not be used with drugs (Medicines)
- Do not sleep after taking medicine
- After 5 PM could not eat more food
- More water during the day, at night, less water
- Good Sleep Time 10 PM to 4 AM
- When final low battery don't talk phone (1000 times more radiation releases)
Please be sure to share this content. Find Bellow Telugu Text Image.
My First Post
Hi! Everyone. Thanks for Coming this Blog. This Blog will Post Helpful, Informative, New Things, Interest News and Benefit Articles. These Articles are benefit and share to Yours Circles.
Subscribe to:
Posts (Atom)